కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద.. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతులు లేక వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్టానికి చెందిన వలసదారులు తెలంగాణ రాష్ట్రంలో కూలీ పనులకు వెళ్లి లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కొంత వెసులుబాటు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్ర సరిహద్దుకు వలస కూలీలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంలేదు. ఈమేరకు తెలంగాణ ఉన్నతాధికారుల వివరణ నిమిత్తం పేర్లు నమోదు చేసుకున్న వలస కూలీలను మాత్రమే అనుమతిస్తున్నారు.
ఇదీ చూడండి: