కృష్ణా జిల్లా మైలవరంలో కరోనాపై పోరాడుతున్న పోలీసులు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య శిబిరాన్ని సీఐ శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాలతో నిర్వహించిన ఈ శిబిరాన్ని డీఎస్పీ శ్రీనివాసులు ప్రారంభించారు. ప్రజలను కాపాడేందుకు కష్టపడుతున్న పోలీసులు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని డీఎస్పీ కోరారు.
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న పోలీసులకు ఎల్లవేళలా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు. సీనియర్ పోలీసు అధికారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.ప్రభుత్వ వైద్యులు శరత్ చంద్ర, ఎస్ఐ ఈశ్వరరావు, డివిజన్ పరిధిలోని పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: