ETV Bharat / state

'విగ్రహాల కూల్చివేతతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి'

author img

By

Published : Jan 7, 2021, 8:08 PM IST

ఆలయాలు, విగ్రహాలపై దాడులు చేయడాన్ని.. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఖండించారు. విద్వేషాలను రెచ్చగొట్టే వారిని కఠినంగా శిక్షించి.. ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కష్టతరమని అష్టాక్షరి త్రిదండి రామానుజాజీయర్ స్వామి పేర్కొన్నారు.

mandali budha prasad reaction on attacks over idols
విగ్రహాలపై దాడులను ఖండించిన మండలి బుద్ధ ప్రసాద్

రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, విగ్రహాల మీద దాడులతో.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. మతాలను అడ్డం పెట్టుకుని.. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఎవరు, ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు.

కరోనా కారణంగా గత ఆరు నెలల నుంచి భక్త సంచారం లేక.. దేవాలయాల నిర్వహణ ఇబ్బందిగా ఉందని అష్టాక్షరి త్రిదండి రామానుజాజీయర్ స్వామి గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమూ కష్టంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

రైతులను ఆదుకోకపోతే ఆందోళనలే..: ఎమ్మెల్యే బాలయ్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.