కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలు.. ఏప్రిల్ 10, 11న మచిలీపట్నంలో జరగనున్నాయి. సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు భాషా వికాసం కోసం రచయితల సంఘం 50 ఏళ్లుగా కృషి చేస్తుందని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. తెలుగు భాష మనుగడ కోసం కృష్ణా జిల్లా రచయితల సంఘం దీటుగా పోరాడిందని అన్నారు. తెలుగుకు ప్రాచీన హోదా, మాతృభాషలో విద్యా బోధనా అంశాల్లో రచయితల సంఘం తెలుగు వాణి వినిపించిందని అభినందించారు.
ప్రస్తుతం తెలుగునాట నిర్లిప్తత నెలకొందని తెలిపారు. ప్రజల్లో కులం, మతం, ప్రాంతీయ తత్వం పెచ్చుమీరిపోవడంతో.. జాతిని తట్టి లేపేలా రచయితలు కృషి చేయాలని చెప్పారు. స్వర్ణోత్సవాల్లో.. పసిడి కృష్ణ పేరుతో గ్రంధాన్ని వెలువరించనున్నట్లు రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శిలు గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచందులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రచయితల సంఘ ప్రతినిధులు, భావతరంగణి ఎడిటర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఈ నెల 15 నుంచి 19 వరకు.. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు