కరోన వైరస్ మానవ సంబంధాలను మంటగలుపుతోంది. అనారోగ్య కారణాలతో మృతి చెందినప్పటికీ కొన్ని గ్రామాల్లో అవసరం లేని అనుమానాలతో... అంత్యక్రియలు నిర్వహించకుండా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.
అతను కరోనా వైరస్ తో చనిపోయాడని, అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తే.. గ్రామమంతా కరోనా వ్యాప్తి చెందుతుందని గ్రామస్థులు మృతదేహాన్ని ఊర్లోకి తీసుకురాకుండా అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై మదీనా బాషా.. ఘటన స్థలానికి చేరుకొని, గ్రామస్థులతో చర్చించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒప్పించారు. అంత్యక్రియలు పూర్తైన అనంతరం పంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రామంలో శానిటైజేషన్ చేయించారు.
ఇదీ చదవండి:
దాతల సహకారం.. అవనిగడ్డ కొవిడ్ సెంటర్కు 9 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు