కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు నిరాకరించిందనే కోపంతో యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో అడ్డువచ్చిన యువతి తల్లి, చెల్లికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కూచిపూడి పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి