కృష్ణా జిల్లా మైలవరంలో మద్యం దుకాణాల ముందు.. మందుబాబులు భారీగా బారులు తీరారు. ఉదయం 11 గంటలకు షాపులు ప్రారంభం కావడంతో.. లాక్డౌన్ ఉన్నా పట్టించుకోకుండా.. ముందుగానే దుకాణాల వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం నియమించబడిన నూతన ధరలతో మద్యం ప్రజలకు అందజేస్తున్నామని... క్యూ పద్ధతులు పాటిస్తూ.. ప్రతి మద్యం షాపు వద్ద.. పోలీసు సిబ్బంది సహకారం కూడా తీసుకుంటున్నామని మైలవరం ఎక్సైజ్ ఎస్సై బాలాజీ తెలిపారు. ఎవరైతే లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఉంటారో.. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం