ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఆతిథ్యరంగానికి భారీ నష్టం.

author img

By

Published : May 28, 2020, 2:33 PM IST

కరోనా దెబ్బతో ఆతిథ్యరంగం అతలాకుతలమయింది. ఏడాది కాలంగా అంతంత మాత్రంగా ఉన్న ఈ పరిశ్రమ కరోనా కాటుతో పూర్తిగా కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది. ఒక్క ఆతిథ్యం ఇచ్చే హోటళ్లపైనే కాదు...అనుబంధంగా ఉన్న ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్‌లు, మండపాల అలంకరణలు, వీడియోగ్రఫీ వంటి 20కిపైగా రంగాలపైనా వైరస్‌ ప్రభావం పడింది. ఫలితంగా, వేసవిలో... వేడుకల సంబరాల్లో మునిగిపోయే తెలుగు రాష్ట్రాలు నేడు వెలవెలబోతున్నాయి. లాక్‌డౌన్‌ తరవాత మునుపటిలా ప్రజలు ఈ రంగం వైపు అంతగా దృష్టిసారించరనేది ఎవరూ కాదనలేని కఠోర వాస్తవం. ఒక వేళ వారిని ఆకర్షించాలంటే మాత్రం ప్రజల ఆలోచనలకు, ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టుగా హోటళ్లను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అసలే నష్టాల ఉబిలో ఉన్న వాళ్లకు.. ఈ ఖర్చు గుదిబండగా మారే అవకాశం ఉంది.

లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఆతిథ్యరంగానికి భారీ నష్టం.లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఆతిథ్యరంగానికి భారీ నష్టం.
లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఆతిథ్యరంగానికి భారీ నష్టం.

ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టేందుకు ఇప్పుడిప్పుడే అవకాశం కలుగుతున్నా....ఇప్పటికే తీవ్రంగా కుంగిపోయిన కొన్ని రంగాలది మాత్రం ఎటూ పాలుపోని పరిస్థితి. వాటిలో ఆతిథ్య, ఆహార రంగం ఒకటి. పెళ్లిళ్లు, వేడుకలు, పార్టీలు, పర్యటకం...దేనికైనా అంతా ఆశ్రయించేది హోటళ్లు, రెస్టారెంట్లనే. ఈ విపత్కర పరిస్థితుల్లో పెళ్లిళ్ళు, వేడుకల్లాంటి శుభకార్యాలు సైతం వాయిదా వేసుకుంటున్నారు. అక్కడక్కడా అరకొరగా జరిగినా...అవి దగ్గరి బంధువులతో ఆడంబరాలకు దూరంగా ఇంటికి దగ్గరగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో... అసలు లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసిన ... తమ పరిస్థితేంటా అని హోటళ్లు, ఈవెంట్ మేనేజర్లలో ఆందోళన మొదలైంది.

లాక్‌డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో జరగాల్సిన పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు, ప్రారంభోత్సవ వేడుకలు, ఇతర కార్యక్రమాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆర్భాటంగా పెళ్లి చేయాలని ముందుగా కల్యాణ మండపాలు, బ్యాంకెట్ హాల్స్ బుక్‌ చేసుకున్న వారంతా అర్థంతరంగా తమ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌లో మొదటి పదిహేను రోజుల వరకు భారీగా వివాహాలు జరుగుతుంటాయి. 2 నుంచి 3నెలల ముందు బుక్ చేసుకుంటే తప్ప మండపాలు దొరికేవి కావు. ఒక్కో ఫంక్షన్‌ హాల్‌లో ఈ సీజన్‌లో మొత్తంగా సగటున 300 పెళ్లిళ్లు జరుగుతుండేవి. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం చిన్న పాటి కార్యక్రమాలకే దిక్కులేదు. లాక్‌డౌన్ సడలింపులతో పరిస్థితుల్లో మార్పు వచ్చినా.... అన్‌సీజన్‌ కావడం వల్ల ఈ సంక్షోభం కోరల్లో నుంచి బయటపడేదెప్పుడని కలత చెందుతున్నారు నిర్వాహకులు.

ఉపాధి కరవు

వేసవి వచ్చిందంటే పెళ్లిళ్లు, శుభకార్యాలతో ఊరూవాడా సందడిగా ఉంటుంది. ఆ సందడిపైనే కల్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్‌, డెకరేషన్‌, లైటింగ్‌, బ్యాండ్‌, మ్యారేజ్‌ ఈవెంట్‌ నిర్వాహకుల వ్యాపారం ఆధారపడి ఉంటుంది. సంవత్సరం మొత్తం వ్యాపారంలో ఒడుదొడుకులు ఉన్నా...90రోజుల సీజన్‌లో మిగతా కాలంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకుంటారు. పెళ్లంటే వందలాది మందికి పని దొరుకుతుంది. ఫంక్షన్‌ హాల్‌ యజమానులు, ఫొటో, వీడియో గ్రాఫర్స్‌, పెళ్లి పందిరి వేసేవాళ్లు, టెంట్లు, డెకరేషన్‌, సౌండ్స్‌, టెంట్‌హౌజ్‌లు, డీజేలు,బ్యాండ్‌మేళా ఇలా ప్రతి ఒక్కరికీ చేతినిండా పని ఉంటుంది. కానీ, ఈ ఏడాది మాత్రం పెళ్లిళ్లు జరిపించే పూజారులకు కూడా ఉపాధి కరవైంది.

ప్రపంచదేశాల్లో పర్యాటక రంగం అంతలా అభివృద్ధి చెందడానికి ఆతిథ్య రంగం ప్రధానంగా దోహదం చేస్తుంది. తెలియని ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించే ఆతిథ్య రంగం ఇప్పుడు కుదేలైంది. ఈ రంగంలో కరోనాకు ముందు...కరోనా తర్వాత అన్న రీతిలో పెనుమార్పులు జరగనున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరువాత కూడా పెద్దగా వ్యాపారం ఉండకపోవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గటంతో పాటు భౌతిక దూరంపై పెరిగిన అవగాహన దృష్ట్యా పూర్తిగా పరిశ్రమ కోలుకోవాలంటే రెండేళ్లైనా సమయం పడుతుందని భావిస్తున్నారు.

కరోనా ముప్పుతో కుదలయ్యే అవకాశం

కొన్నేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు హోటళ్ల వేదికగానే జరుగుతుండడంతో ప్రధాన నగరాల్లో ఆతిధ్యరంగానికి మంచి డిమాండ్ ఉంటూ వచ్చింది. రెండేళ్లతో పోల్చితే రూమ్‌ ఆక్యుపేషన్‌ సగటు 60శాతం వరకూ ఉంది. ఇందుకు అనుగుణంగా హోటల్ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఒక్కో ప్రధాన నగరంలోని హోటళ్లలో దాదాపు 50వేల మంది ప్రత్యక్షంగా, లక్షమంది పరోక్షంగా పనిచేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత కొంతవరకూ డీలా పడినా....మళ్లీ త్వరగానే పుంజుకోగలిగిన హోటల్ రంగం కరోనా ముప్పుతో పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. 13రకాల పన్నులు చెల్లించే ఈ రంగం నేడు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తోంది. ఆతిథ్యరంగానికి అనుబంధంగా ఉన్న బ్యాంకెట్ హాల్స్ కూడా ఎలాంటి వేడుకలు లేక వెలవెలబోతున్నాయి.

ఆందోళనలో నిర్వాహుకులు

హోటల్, లాడ్జీల వ్యాపార రంగం లాభాల బాట పట్టాలంటే 65శాతం వ్యాపారం జరగాలి. ఏపిలో గత ఏడాది కాలంలో నగరంలో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కార్యక్రమాలు తగ్గటం, రాజధాని మార్పు ప్రకటన వంటి పరిణామాలతో 60శాతం వరకూ ఉన్న ఆక్యుపెన్సీ 40శాతానికి పడిపోయింది. కరోనా ప్రభావంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైందని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడు మార్పులొస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. మార్పులు వచ్చినా..కరోనా భయంతో మునపటిలా ఒకటి రెండేళ్లు పాటు వ్యాపారాలు సాగటం కష్టమేనని అంటున్నారు. ప్రభుత్వ పరంగా ఫిక్స్‌డ్ విద్యుత్ ఛార్జీలు తగ్గించటంతో పాటు జీఎస్టీ, ఇతర పన్ను రాయితీ కల్పిస్తేనే ఈ రంగం నిలదొక్కుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బోసిబోయిన రెస్టారెంట్లు

వ్యాపారాలు లేనప్పుడు ఎందుకనే భావనతో ఉద్యోగులు, సిబ్బందిని యజమానులు ఇళ్లకు పంపించేశారు. కరోనా వైరస్‌ భయంతో పాటు, లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రంగాలు దెబ్బ తిన్నందున ఇప్పట్లో ఎవరూ ఇళ్లు కదిలే అవకాశం ఉండకపోవచ్చు. లాక్‌డౌన్‌కు ముందు చిన్న స్థాయి నుంచి ప్రపంచ స్థాయి సంస్థలు సైతం తరచూ సమావేశాలు నగరాల్లో ఏర్పాటు చేస్తుండేవి. ఫలితంగా, సీజన్‌లేని సమయంలో కూడా ఆతిథ్యరంగం సందడిగా ఉండేది. ఇకపై అలాంటివి కూడా వుండే అవకాశం లేదు కాబట్టి వ్యాపారం చాలా వరకూ దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు ఆతిథ్య రంగ నిపుణులు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత భౌతిక దూరానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాల్సి ఉన్నందున నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరో రెండేళ్లపాటు నష్టాలతోనే నడపాల్సి వుంటుంది కాబట్టి, వీలైనంత మేర నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు ఆతిథ్యరంగ నిపుణులు.

మునుపటి కళలను సంతరించుకోవటం కష్టమే

ఓ రకంగా కరోనా దెబ్బ ఆతిథ్య రంగాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిందని నిర్వాహకులు వాపోతున్నారు. లాక్‌డౌన్‌ తరవాత కొద్దో గొప్పో ఆన్‌లైన్ డెలివరీలు పెరిగే అవకాశం ఉన్నా అవి ఏమాత్రం ప్రభావం చూపవంటున్నారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి లేకపోవడం, ప్రైవేటు ఉద్యోగులకు ….ఉద్యోగంపై భరోసా కోల్పోవటం, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సరిగ్గా జీతాలు అందని వైనం. చేతి ఖర్చులకే నగదు కరవైన సమయంలో ఇతర ఖర్చులకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు మెగ్గు చూపుతారు. ఫలితంగా, వారాంతాల పేరుతో బయటకు వెళ్లి సరదాగా బయట గడపటం చిన్న చిన్న ఉల్లాసభరిత కార్యక్రమాలకు స్వస్తి పలికే దిశగా ప్రజల ఆలోచనలు మారుతాయి. ఇవన్నీ హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపి...మునుపటి కళను సంతరించుకోవడం కలగానే మిగిలిపోయే ప్రమాదముందని వాపోతున్నారు వ్యాపారస్థులు.

పొట్టకూటిపై ప్రభావం

ఆతిథ్యరంగం నష్టాల కడలిలో ఉండడంతో రోడ్డు మీద బడ్డీ కొట్టు నుంచి స్టార్‌ హోటల్‌లో మేనేజర్‌ స్థాయి వరకూ అందరి పొట్టకూటిపై ప్రభావం పడింది. పదుల సంవత్సరాలుగా ఈ రంగంలో హమాలీలు, రూం బాయ్‌లు, వంట మాస్టార్లుగా ఉన్నవాళ్లు ఇప్పుడు తమ పరిస్థితి ఎంటా అని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించే ఈ రంగాన్ని కరోనా కాటు వేయడం వల్ల నిరుద్యోగ సమస్య తలెత్తే ప్రమాదముందంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం దేశంలోని మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తోంది కేంద్ర ప్రభుత్వం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలన్న...ఉపాధి అవకాశాలు పెరగాలన్న మౌలిక సదుపాయాలే ముఖ్యభూమిక పోషిస్తుందని విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల్లో కీలక పాత్ర పోషించే ఆతిథ్యరంగం మనుగడే ప్రశ్నార్థకమైంది. కాబట్టి, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగం కరోనా నష్టాల నుంచి కోలుకుని మళ్లీ వ్యాపార బాట పట్టేలా ప్రోత్సాహకాలు అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ గడ్డు పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉండడం వల్ల... ఆ దిశగా ప్రోత్సాహకాలు అందిస్తే తప్ప ఆతిథ్య రంగానికి పునర్వైభవం రావడం కష్టమే.

ఇవీ చదవండి

లాక్​డౌన్ ఎఫెక్ట్: కుదేలైన కూరగాయ రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.