ETV Bharat / state

'ప్రభుత్వ వైఫల్యంతోనే లంక గ్రామాలకు వరద ముంపు'

author img

By

Published : Aug 18, 2020, 7:57 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని... వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలు రామకృష్ణ, మధులు అన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే లంక గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని ఆరోపణలు చేశారు. సీఎం జగన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించి సలహాలు తీసుకోవాలన్నారు.

leftist parties protest
ప్రభుత్వ వైఫల్యంతోనే లంక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి

ఒకవైపు కరోనా, మరోవైపు వరదల వల్ల రాష్ట్రం నలిగిపోతోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు అన్నారు. గోదావరి వరద నీరు ఉప్పొంగుతున్న కారణంగా అనేక లంక గ్రామాలకు బయటి ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయని... వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే లంక గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని ఆరోపించారు. ముంపునకు గురైన గ్రామ ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏటువంటి సహాయం అందటం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అధిక సంఖ్యలో రైతులు నష్టపోయారని... వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

'విద్యా సంస్థల భూములను.. ఇళ్ల పట్టాలకు వాడొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.