రైతులకు తీరని అన్యాయం చేసే రీతిలో ఉన్న నూతన చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా మైలవరంలో వామపక్ష పార్టీలు నిరసన దీక్షను చేపట్టాయి. నూతన వ్యవసాయ చట్టాల వల్ల అన్నదాతలు నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.
ఆ ప్రక్రియ నిలిపేయండి..
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బోర్లకి మోటార్లు బిగించే పక్రియని నిలిపివేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి ఆంజనేయులు, సీపీఐ కార్యదర్శి కోటేశ్వరరావు, సీఐటీయూ నాయకులు చాట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.