ETV Bharat / state

Anandhaiah: 'నా పేరుతో తప్పుడు మందులు విక్రయిస్తున్నారు.. దూరంగా ఉండండి' - vijayawada latest news

కరోనా థర్డ్​వేవ్​ను అడ్డుకునేందుకు.. ముందస్తుగానే మందును తయారు చేస్తున్నట్లు కృష్ణపట్నం ఆనందయ్య చెప్పారు. విజయవాడలో సీపీఐ నాయకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. పురాతనమైన ఆయుర్వేద వైద్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కృష్ణపట్నం ఆనందయ్యకు సన్మానం
కృష్ణపట్నం ఆనందయ్యకు సన్మానం
author img

By

Published : Aug 14, 2021, 6:06 PM IST

కరోనాకు మందు తయారు చేసి వార్తల్లో నిలిచిన కృష్ణపట్నం వాసి ఆనందయ్యను విజయవాడలో పట్టణ సెంట్రల్ నియోజకవర్గం సీపీఐ నాయకులు ఘనంగా సన్మానించారు. స్థానికులకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. కరోనా మూడోదశను సమర్థంగా అడ్డుకునేందుకు.. ముందస్తుగానే ప్రకృతిసిద్ధ మందును తయారు చేస్తున్నామని ఆనందయ్య తెలిపారు. కరోనా మహమ్మారి కి ఆయుర్వేదం పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.

ధనార్జన కోసం కొందరు నకిలీ మందును తయారు చేసి తన పేరుతో విక్రయిస్తున్నారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆనందయ్య కోరారు. మనోధైర్యంతో కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని సూచించారు. పురాతనమైన ఆయుర్వేద వైద్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

పులిచింతల నీటి విడుదలే.. ఇసుక లారీలను ముంచేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.