అక్రమంగా మద్యం కలిగి ఉన్నారన్న ఆరోపణలకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు కృష్ణలంక ఎస్ఐను సస్పండ్ చేశారు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లను గతంలో సీపీ ద్వారక తిరుమలరావు అక్రమంగా మద్యం కలిగి ఉన్నారన్న అంశంపై సస్పెండ్ చేశారు. వారిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ ఎస్ఐ నిర్లక్ష్యం వహించాడు. ఈ విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణ జరిపి ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి...