తెలంగాణ నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి సరఫరా అవుతూనే ఉంది. కృష్ణా జిల్లా నూజివీడు ఆర్డీవో ఆఫీస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బొలెరో వాహనంలోని ఫ్రూట్స్ బాక్సుల మధ్యలో 46 మద్యం బాటిళ్లని గుర్తించారు. వాటి విలువ 48 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి... డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.
దొనకొండ క్వారీల రోడ్డు, పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద కూడా పోలీసులు తనీఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం రవాణా చేస్తున్న 14 బైకులతో పాటు ఒక కారుని సీజ్ చేశారు. 21 మందిని అదుపులోకి తీసుకొని.. వారి వద్ద నుంచి 167 మద్యం బాటిళ్లతో పాటు 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: శ్రీశైలం ఆలయ టికెట్ల కుంభకోణంలో విచారణ వేగవంతం