క్వారంటైన్లో ఉన్న కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన లారీ డ్రైవర్‌కు కరోనా నెగెటివ్ రావటంతో అతడిని క్వారంటైన్ కేంద్రం నుంచి పంపించారు. ఈనెల 17న మహారాష్ట్ర సరిహద్దులోని రాఠీ సమీపంలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినందున అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదే లారీలో ఉన్న నూజివీడుకు చెందిన డ్రైవర్‌ను క్వారంటైన్‌కు తరలించి నమూనాలు సేకరించారు. నిన్న వచ్చిన పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చింది. దీంతో అధికారులు అతడికి లారీని అప్పగించి నూజివీడుకు పంపించారు.
ఇవీ చదవండి.. కరోనాను జయించిన ఎనిమిది మంది