కరోనా వైరస్ నుంచి కోలుకొని విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రి నుంచి 8 మంది బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారిలో ఏప్రిల్ 2న చేరిన విజయవాడలోని రాణిగారితోట, చెక్ పోస్ట్ ప్రాంతానికి చెందిన ఇద్దరు, నూజివీడు, చందర్లపాడులోని ముప్పాళ్లలకు చెందిన ఇద్దరు, ఏప్రిల్ 4వ తేదీన చేరిన జగ్గయ్యపేట, కానూరు, సనత్ నగర్, నందిగామలకు చెందిన వారు ఒక్కొక్కరున్నారు. కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన వ్యక్తులను కరోనా జిల్లా ప్రత్యేక అధికారి సిద్దార్ధ జైన్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అభినందించారు. వారికి మెరుగైన వైద్యం అందించి కోలుకునేందుకు కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కరోనాను జయించిన ఎనిమిది మంది - సిద్ధార్థ ఆసుపత్రి లేటెస్ట్ వార్తలు
కరోనా వ్యాధిని జయించిన 8 మంది పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాల నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం అందించి కోలుకునేందుకు కృషి చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.