కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ వల్ల సంభవించే మరణాలు తగ్గించడమే ధ్యేయంగా వైద్యులు, అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ దిశానిర్దేశం చేశారు. లాక్డౌన్ సడలింపుల కారణంగా ఈ నెలలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై రెవెన్యూ, వైద్య అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన చర్చించారు.
విజయవాడలో పలు చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని... దీనికి తోడు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎమ్లు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి... అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించాలని చెప్పారు. కరోనా బారిన పడిన వ్యక్తులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా హోం ఐసోలేషన్‌కు అనుమతించే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: