కృష్ణా జిల్లాలో జూలై 1నుంచి 4వరకు జరగనున్న ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి కలెక్టర్ అధ్యర్యంలోని యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో పేదలకు నవరత్నాల కింద 48 వేల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించి కలెక్టర్ జే నివాస్తో పాటు సంయుక్త కలెక్టర్లు..పలు ప్రాంతాల్లో పర్యటించి ఇళ్ల స్థలాల లే అవుట్లలో మెగా హౌసింగ్ మేళా నిర్వహణకు సన్నాహకాలు చేపట్టారు. విజయవాడ అర్బన్ ప్రాంతానికి చెందిన 3,700 మంది లబ్ధిదారులకు పెనమలూరు మండలం వణుకూరులో కేటాయించిన ఇళ్ల లే అవుట్ ను, విజయవాడ రూరల్ మండలం నున్న లోని లేఔట్ ను కలెక్టరు నివాస్ పరిశీలించారు.
జగ్గయ్యపేటలోని బలుసుపాడు రోడ్డు హౌసింగ్ లేఔట్ - 2లో లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తో కలిసి సంయుక్త కలెక్టర్ మాధవీలత పరిశీలించారు.
ఇదీ చదవండి: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పూర్తైతే.. ఎడారిగా ఏపీ: కొల్లు రవీంద్ర