ETV Bharat / state

'వ్యవసాయ, విద్యుత్​ చట్టాలు ఉపసంహరించుకునే దాకా ఉద్యమిస్తాం' - farmer protest news

వ్యవసాయ, విద్యుత్​ చట్టాలు రద్దు చేసే దాకా ఉద్యమిస్తామని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాలు వెనక్కు తీసుకునేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని విజయవాడలో చెప్పారు.

Kisan Sangh Co Ordination Committee
రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం
author img

By

Published : Dec 10, 2020, 7:47 PM IST

మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్​ బిల్లు-2020 ను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాలను వెనక్కు తీసుకునేదాకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

నాలుగు సార్లు రైతులతో చర్చలు జరిపిన కేంద్రం.. చట్టాల ఉపసంహరణను తిరస్కరించటంతో తిరిగి ఉద్యమం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. ఇందులో భాగంగా టోల్ ప్లాజాల దిగ్భంధనం, 14 నుంచి జిల్లా కేంద్రాల్లో నిరసనలు, 17 నుంచి పార్లమెంట్ సభ్యులకు.. చట్టాల రద్దుకు కృషి చేయాలని వినతి పత్రాలు అందజేస్తామన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల వలన కలిగే నష్టాలను ఇంటింటికి తెలిసేలా కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. కేంద్ర ఐక్య వేదికను కోరి ప్రతి గ్రామంలో రైతుల ఇంటి దగ్గర జ్యోతి వెలిగించాలని పిలుపునిస్తున్నామన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ, విద్యుత్​ చట్టాలను రద్దుచేసేలా ఉద్యమిస్తామని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ తెలిపారు.

ఇదీ చదవండి: 'నిరసనలు విరమించండి- చర్చకు కేంద్రం సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.