ఇవీ చదవండి..
150కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం: కేశినేని నాని - కొండూరు
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే తిరిగి చంద్రబాబునాయుడే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. కృష్ణా జిల్లా ఏ. కొండూరు నియోజకవర్గంలో తిరువూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కే.ఎస్. జవహర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కేశినేని నాని ఎన్నికల ప్రచారం
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే తిరిగి చంద్రబాబునాయుడే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. కృష్ణా జిల్లా ఏ. కొండూరు నియోజకవర్గంలో తిరువూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కే.ఎస్. జవహర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంభంపాడు, గొల్లమందల, రేపూడి, కుమ్మరికుంట్ల గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రజలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో 150కి పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని నాని ధీమా వ్యక్తంచేశారు. నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన వైకాపా అభ్యర్థికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.
ఇవీ చదవండి..
sample description