సినిమా పరిశ్రమ(film industry)పై వైకాపా దోపిడీని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan) కళ్లకు కట్టినట్లు వివరిస్తే.. వైకాపా మంత్రులు విమర్శలు చేస్తున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేశ్(Janasena leader pothina Venkata Mahesh) మండిపడ్డారు. వైకాపా నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. సీఎం జగన్(cm jagan) తన సొంత చెల్లి షర్మిలను మోసం చేశారని ధ్వజమత్తారు.
పవన్‌పై సీబీఐ కేసులున్నాయా.. ప్రజలను దోచుకున్నారా అని మహేశ్ ప్రశ్నించారు. తడిగుడ్డతో గొంతులు కోసే నైజం జగన్‌దని మండిపడ్డారు. సొంత బాబాయి హత్య జరిగితే దోషులను పట్టుకోలేకపోయారని విమర్శించారు. వేలాది మంది కష్టంతో సినిమా తీస్తే.. వైకాపా కార్యకర్తలతో బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మిస్తారా అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖనే బ్రష్టు పట్టించిన మంత్రి.. పవన్‌ను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. మెగా కుటుంబం ఫొటోలు పెట్టి.. భిక్ష అడిగిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయమని గెలిపిస్తే.. దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు కన్నా.. సినిమా టిక్కెట్లు అమ్ముకోవడమే జగన్ కు ముఖ్యమా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి