ETV Bharat / state

పునాదిపాడులో 'జగనన్న విద్యాకానుక'ను ప్రారంభించనున్న సీఎం - krishna district latest news

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలంలో 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు పునాదిపాడు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.

Jagananna Vidya Kanuka to be Launched In Punadipadu
పునాదిపాడులో 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
author img

By

Published : Oct 6, 2020, 3:21 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలంలో ప్రారంభించేందుకు అధికారులు, అధికార పార్టీ నేతలు సమాయత్తమయ్యారు. పునాదిపాడు గ్రామంలోని జడ్పీ పాఠశాల ప్రాంగణాన్ని వేదికగా నిర్ణయించారు.

గురువారం ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారు: అయ్యన్నపాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.