వర్షాకాల సీజన్ ముగిశాక పాఠశాలల్లో నాడు-నేడు పనులు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో మనబడి, నాడు-నేడుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, విద్యా శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
నాడు–నేడు కింద చేపట్టిన పనులు, భవనాల రంగులపై సమావేశంలో సీఎం చర్చించారు. రంగుల నమూనాలను అధికారులు సీఎంకు సూచించారు. పాఠశాల భవనాల రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. వర్షాకాల సీజన్ ముగిశాక పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు, మూడో దశ పనులూ సకాలంలో చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి సచివాలయాల ఇంజినీర్లు వారానికి ఒకసారి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి