కృష్ణా జిల్లా నందిగామలో అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నందిగామలోని భారత్ టాకీస్ సెంటర్లో 13.5 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని నందిగామ పీడీఎస్ డీటీకీ అప్పగించినట్లు నందిగామ ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తున్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత