కృష్ణా జిల్లా గుడివాడ ధనియాలపేటలో దంపతుల మధ్య వివాదం హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. గ్రామానికి చెందిన యేసు, అన్నామణి భార్యాభర్తలు. కొంతకాలంగా వీరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం భర్త యేసు భార్యతో గొడవపడి ఆమెకు బలవంతంగా పురుగుల మందు పట్టించాడు. అనంతరం తానూ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అన్నామణి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు విజయవాడకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: