మండే ఎండలకు పశుపక్ష్యాదులే కాకుండా... తేనెటీగలు సైతం తల్లడిల్లుతున్నాయి. పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. కృష్ణా జిల్లా దివిసీమలో రెండు రోజులుగా నమోదు అవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు తేనెటీగలు నీటి జాడ కోసం పరుగులు తీస్తున్నాయి.
కృష్ణా నదిలో నీరు ఉప్పుగా ఉండటం, కాలువల్లో నీరు ఎండిపోయిన పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. తేనెటీగలు పుప్పొడి ద్వారా పంటలు ఫలదీకరణం చెందేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: