ETV Bharat / state

బైక్​ను ఢీకొట్టిన లారీ.. హోమ్ గార్డు మృతి, కానిస్టేబుల్​కు గాయాలు - చెన్నై కోల్​కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

బైక్​ను లారీ ఢీకొట్టిన ఘటనలో హోంగార్డు మృతి చెందగా.. కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణా జిల్లాలో చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఉన్నతాధికారులు హోంగార్డు కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.20వేలు అందించారు.

home guard deid in road accident at chennai kolkata national highway

author img

By

Published : Jul 6, 2021, 10:20 AM IST

Updated : Jul 6, 2021, 2:07 PM IST

చెన్నై - కోల్​కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గన్నవరం బస్టాండ్ సమీపంలో తెల్లవారుజామున 4 గంటలకు విధుల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ బైక్​ను లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే హోమ్ గార్డ్ అయ్యప్ప మృతి చెందగా.. కానిస్టేబుల్ రవి పరిస్థితి విషమంగా ఉంది. అతణ్ని వైద్యం కోసం విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని సీఐ కోమాకుల శివాజీ పరామర్శించారు. రహదారిపై ఆపిన ట్రాలీ ఆటోను పక్కన పెట్టిస్తున్న క్రమంలో వెనుకనుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టిందని సీఐ చెప్పారు. ట్రాలీలో ఉన్న పైపులు వీరిపై పడడంతో తీవ్రగాయాలయ్యాయన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేలోపే హోమ్ గార్డు మృతి చెందినట్లు చెప్పారు. గాయపడిన రవిని మెరుగైన వైద్య చికిత్సల కోసం అను హాస్పిటల్​లో చేర్పించామన్నారు. ప్రస్తుతం రవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు.

హోంగార్డు మృతదేహానికి నివాళులు .. కుటుంబానికి ఉన్నతాధికారుల పరామర్శ

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని హోమ్ గార్డ్ అయ్యప్ప మృతదేహాన్ని డీసీపీ హర్షవర్ధన్ రాజు, ఏసీపీ విజయ పాల్ సందర్శించి సంతాపం తెలిపారు. హోమ్ గార్డ్ కమాండెంట్ ప్రేమ్ జీత్ అయ్యప్ప మృతదేహానికి దగ్గర ఉండి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు. అడ్మిన్ డీసీపీ మేరీ ప్రశాంతి అయ్యప్ప మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తక్షణ సాయం కింద 20 వేలు రూపాయలు అందించినట్లు సీఐ శివాజీ తెలిపారు.
ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: GIRL KIDNAP: బాలిక కిడ్నాప్‌.. స్పృహలేని స్థితిలో ఆచూకీ

Last Updated : Jul 6, 2021, 2:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.