పల్లెటూళ్లలోనూ పక్కా ఇళ్ల పేరుతో భవనాలు వెలుస్తున్న రోజులివి. అలాంటి పద్ధతి తనకు వద్దు అనుకుంది కృష్ణాజిల్లా గొల్లపూడి గ్రామానికి చెందిన విద్య. తాను నిర్మించుకునే ఇల్లు పర్యావరణానికి ఎలాంటి హాని చేయొద్దు అనుకుంది. రాష్ట్ర రాజధానికి దగ్గరలోని గొల్లపూడి గ్రామంలో అలాంటి నిర్మాణమే మెుదలుపెట్టింది. ఇప్పుడు ఆ ఇళ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అపార్టుమెంట్లు, డూప్లెక్స్ విల్లాల పేరుతో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తూ....నగరాన్ని కాంక్రీట్ జంగిల్లా చేస్తుంటే... పర్యావరణంపై ఉన్న మక్కువతో సిమెంటు, ఇటుకలు, ఇనుము స్థానంలో కేవలం రాతి, మట్టి, ఫెవికాల్ ఉపయోగించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. పాత చెక్కలు, పాత ఇల్లు కూల్చి వేయగా వచ్చిన వ్యర్థాలను ఉపయోగించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. వృత్తి రీత్యా విదేశాల్లో ఉన్నా....స్వగ్రామంలోనే స్థిరపడాలనే ఆశతో పర్యావరణహితంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారు గొల్లపూడి గ్రామానికి చెందిన విద్య. ఆ ఇంటి విశేషాలేంటో చూడండి!