ETV Bharat / state

AP High Court: మచిలీపట్నంలో వైసీపీకి రెండు ఎకరాలు భూమి కేటాయింపు ఎలా తప్పవతుంది: హైకోర్టు - ap high court news

HC on Lands to Political Parties: మచిలీపట్నంలో వైసీపీకి 2 ఎకరాలు కేటాయింపు ఏ విధంగా తప్పవుతుందని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. 2016లో జీవో జారీ సమయంలో వేరే రాజకీయ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేసింది. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సిద్ధపడి రావాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

HC on Lands to Political Parties
HC on Lands to Political Parties
author img

By

Published : Apr 19, 2023, 1:11 PM IST

HC on Lands to Political Parties: శాసనసభలో 50శాతం సీట్లు పొందిన రాజకీయ పార్టీలకు 4 ఎకరాల వరకు భూమి కేటాయించవచ్చని 2016లోనే అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేస్తే.. మచిలీపట్నంలో వైసీపీకి 2 ఎకరాలు కేటాయింపు ఏ విధంగా తప్పవుతుందని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. 2016లో జీవో జారీ సమయంలో వేరే రాజకీయ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేసింది. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సిద్ధపడి రావాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. మచిలీపట్నంలోని సర్వే నంబరు 371/ఏ1లో వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 2 ఎకరాలు కేటాయింపునకు సంబంధించి 2022 మే 18న ప్రభుత్వం జారీ చేసిన జీవో 360, భూకేటాయింపునకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్‌ను సవాలు చేస్తూ వ్యాపారవేత్త బురక శ్రీబాలజీ కరుణశ్రీ హైకోర్టులో పిల్‌ వేశారు.

న్యాయవాది అంచ పాండురంగారావు వాదనలు వినిపించారు. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ విరుద్ధంగా పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించారన్నారు. బీఎస్‌వో ప్రకారం పాఠశాలలు, రహదారులు, తదితర ప్రజా అవసరాల కోసం మాత్రమే భూములు కేటాయించాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు ప్రారంభించారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్‌ ఎవరు? ఎవరి ప్రయోజనాలు కాపాడటం కోసం పిల్‌ వేశారని ప్రశ్నించింది. న్యాయవాది బదులిస్తూ.. ప్రజా ప్రయోజనాల కోసం వ్యాజ్యం దాఖలు చేశామన్నారు.

రాజకీయ పార్టీలకు ఏ పాలసీ ప్రకారం భూములు కేటాయిస్తున్నారు అందుకు సంబంధించిన వివరాలేవని ధర్మాసనం కోరగా.. 2016లో జారీ చేసిన జీవో 340 ప్రకారం కేటాయిస్తున్నారని బదులిచ్చారు. దానిని పరిశీలించిన ధర్మాసనం.. శాసనసభలో 50శాతం సీట్లు సాధించిన పార్టీకి 4 ఎకరాలు కేటాయించేందుకు ఆ జీవో వెసులుబాటు ఇస్తుందని గుర్తు చేసింది. ప్రస్తుతం రెండెకరాలు కేటాయింపు ఏవిధంగా ఉల్లంఘన అవుతుందని ప్రశ్నించింది. అభ్యంతరం ఉంటే 2016లో జారీ చేసిన జీవోని సవాలు చేసుకోవాలని సూచిస్తూ.. విచారణను వేసవి సెలవుల తర్వాత వాయిదా వేసింది.

దేవాలయ భూములు ఆక్రమించి ఇటుక బట్టీల నిర్మాణాలపై హైకోర్టు స్టే: ఉమ్మడి కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కవులూరు గ్రామ పరిధిలో దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమించి ఇటుక బట్టీల నిర్మాణాన్ని చేపట్టడాన్ని హైకోర్టు నిలుపుదల చేసింది. నిర్మాణాలను నిలువరిస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఉమ్మడి కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కవులూరు గ్రామ పరిధిలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీ ఆంజనేయ దేవస్థానానికి చెందిన సుమారు 17-20 ఎకరాలను ఆక్రమించి ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారంటూ విజయవాడ పటమటకు చెందిన జి.కృష్ణారావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. న్యాయవాది ఎస్‌.ప్రియాంక వాదనలు వినిపించారు. దేవాలయ భూములను అక్రమించి బట్టీలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. భూములను దేవస్థానం తిరిగి తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇటుక బట్టీ నిర్మాణాలపై స్టే విధించింది.

పరిహారం చెల్లించకుండా అధికారులను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్​ కొట్టివేత: కడప జిల్లా అట్లూరు మండలం మలినేనిపట్నం గ్రామంలో వివిధ సర్వే నంబర్లలో భూమి, అందులోని నిర్మాణాలకు పరిహారం చెల్లించకుండా అధికారులను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. పరిహారం చెల్లింపు కోసం ఓసారి అవార్డు జారీ చేశాక దానిని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పేదలకు దక్కాల్సిన పరిహారం దక్కకుండా అడ్డుకునేందుకు పిల్‌ వేసినట్లుందని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. మలినేనిపట్నం గ్రామంలో వివిధ నిర్మాణాలకు పరిహారం కోసం బోగస్‌ క్లైమ్‌లు కోరుతున్నారని, పరిహారం చెల్లించకుండా అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త మామిడి యల్లారెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. విచారణ జరిపిన కోర్టు.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు: వైద్య పరీక్షలకు చెందిన రిపోర్టులపై పాథాలజీలో పీజీ చేసిన మెడికల్‌ ప్రాక్టీషనర్‌ సంతకం ఉండాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొంటూ దాఖలైన పిల్‌లో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, వివిధ జిల్లాల డీఎంహెచ్‌వోలను హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలలో నిర్వహించే వైద్య పరీక్షల రిపోర్టులపై పాథాలజీలో పీజీ చేసిన మెడికల్‌ ప్రాక్టీషనర్‌ సంతకం ఉండటం సబబు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదంటూ కృష్ణా జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థ జనతా సర్వీస్‌ సొసైటీ అధ్యక్షుడు కందుల నారాయణరావు హైకోర్టులో పిల్‌ వేశారు. న్యాయవాది గుడిసేవ నరసింహారావు వాదనలు వినిపించారు. వైద్య నివేదికలపై అనర్హులు సంతకాలు చేస్తున్నారన్నారు. వాటికి విశ్వసనీయత ఉండటం లేదన్నారు. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.