కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్లను కోర్టుకు రావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ అధికారి, విజయవాడ ఇన్‍ఛార్జ్ సీపీ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నిక తీరుపై కోర్టుకు వివరణ ఇస్తున్నారు.
సజావుగా మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరిపించాలని తెదేపా కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టులో వాదనల క్రమంలో కౌన్సిల్ హాలులో వైకాపా దౌర్జన్యాన్ని న్యాయవాది అశ్విన్ కుమార్ కోర్టుకు వివరించారు.
ఇదీ చూడండి:
KONDAPALLY MUNICIPAL CHAIRMAN ELECTION: భారీ బందోబస్తు నడుమ హాజరైన తెదేపా సభ్యులు