దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు.. దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ మీదుగా మరో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఈ నెల 9వ తేదీ నాటికి అండమాన్ సముద్రంపై అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది.
ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని అంచనా వేసింది. అక్టోబరు 11 నాటికి వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర కోస్తాంధ్ర - ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో తేలికపాటి జల్లులు కురుస్తాయని ప్రకటించింది.
ప్రాంతం | నమోదైన వర్షపాతం (సెం.మీ) |
పామర్రు | 5.5 |
బుచ్చయ్యపేట | 3.5 |
ద్వారకాతిరుమల | 2.9 |
గార | 2.7 |
రేపల్లె | 2.2 |
యర్రవారిపాలెం | 1.6 |
విజయవాడ | 1.4 |
పుట్టపర్తి | 1 .3 |
నెల్లూరు | 1 |
ప్రాంతం | నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో) |
గుంటూరు | 36 |
నెల్లూరు | 35.3 |
తిరుపతి | 34 |
ఒంగోలు | 33.4 |
శ్రీకాకుళం | 32.9 |
విజయనగరం | 32.5 |
కర్నూలు | 32.5 |
విశాఖపట్నం | 32 |
రాజమహేంద్రవరం | 31.5 |
ఇదీ చదవండి: