కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లోని ఆంతోనినగర్కు చెందిన ఆర్సీఎం చర్చి ఫాదర్ చేబత్తిన సంతోష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పై ఆయన మృతదేహం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి అక్కడ పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకానిలో మృతుడు గతంలో పని చేసాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు