కృష్ణా జిల్లా కోడూరు మండలం జరుగువారిపాలెం గ్రామానికి చెందిన అప్పికట్ల అమలకు కాళ్లు, చేతులు పనిచేయవు. ఈ దివ్యాంగురాలికి.. ధ్రువీకరణ ఉన్నప్పటికి ఐదేళ్లుగా తనకు పింఛన్ రావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగోక అనేక ఇబ్బందులు పడుతున్నానని.... ఇప్పటికీ తల్లిదండ్రులపై ఆధారపడి బతకాల్సి వస్తోందని ఆమె కన్నీటిపర్యంతమైంది.
నడవలేని స్థితిలో ఉన్నా... అధికారులు కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక ఇంటికి ఒకే పింఛన్ పేరు చెప్పి.. తన విజ్ఞప్తిని పక్కన పెడుతున్నారని వాపోయారు. తాత చనిపోయి మూడేళ్లు దాటినా ఆయన పేరు తొలగించకుండా అదే సాకుతో పింఛన్ ఇవ్వటం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పదించి ఈ దివ్యాంగురాలికి పెంక్షన్ ఇప్పించవలసిందిగా కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కోరుతున్నారు.