ETV Bharat / state

రోగులకు అందుబాటులో...431 అత్యవసర ఔషధాలు - ప్రభుత్వ ఆసుపత్రులు

గత డిసెంబర్​లో వైద్యనిపుణుల బృందం సూచించిన అత్యవసర ఔషధాల జాబితా ప్రకారం అదనంగా 431 రకాల మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుబాటులో ఉంచన్నారు. అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వైద్యశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. మందుల కొనుగోలుకు రూ.90 కోట్ల టెండర్లను ఆహ్వానించారు.

రోగులకు అందుబాటులో...431 అత్యవసర ఔషధాలు
author img

By

Published : Jul 10, 2019, 10:44 AM IST

రోగులకు అందుబాటులో...431 అత్యవసర ఔషధాలు
అత్యవసర ఔషధాల జాబితా ప్రకారం మందుల కొనుగోళ్లకు వైద్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 320 మందులకు అదనంగా మరో 431 రకాల మందులను 45 రోజుల్లోగా ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు ఆదేశాలు జారీఅయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతను క్రమేపి తగ్గిస్తామని వైద్యశాఖ అధికారులు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 751 రకాల మందులను రోగులకు అందుబాటులో ఉంచాలని గతేడాది డిసెంబర్​లో వైద్యనిపుణుల కమిటీ సూచించింది. సాధారణంగా వినియోగించే ఔషధాలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యులు రాసే మందులు అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 320 రకాల ఔషధాలు మాత్రమే ఉన్నందున రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగిలిన మందుల కొనుగోళ్ల కోసం టెండర్లను ఆహ్వానించారు. 90 కోట్ల రూపాయల ఖర్చుతో మందులు కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఔషధాల జారీ విషయంలో ఆసుపత్రి సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి : వాస్తవాలు తెలుసుకోండి కన్నా : లోకేశ్

Intro:Ap_vsp_46_09_nukalmmanu_darsinchukunna_mantri_botsa_av_AP10077_K.Bhanojirao_Anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా గా కుటుంబ సభ్యులతో కలిసి ఇ అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రికి దేవస్థానం సహాయ కమిషనర్ సుజాత సిబ్బంది స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

Body: నూకలమ్మ దర్శనంలో భాగంగా అనకాపల్లి వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయన్ని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీర భద్ర రావు కలిశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమరనాథ్ చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ వైకాపా అనకాపల్లి పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకులు దాడి రత్నాకర్, వైకాపా రాష్ట్ర కార్యదర్శిదంతులూరి దిలీప్ కుమార్ ఉన్నారు.

Conclusion:అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వైకాపా నాయకులు కార్యకర్తల సమక్షంలో మంత్రి బొత్స సత్యనారాయణ కేకు కోసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు మంత్రి బొత్స సత్యనారాయణ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.