ETV Bharat / state

మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి మరచిపోయారు - ఈ నెల 21వరకు డెడ్​లైన్

Government Solve The Problems Of Municipal Workers And Employes: రాాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పట్టించుకోవట్లేదని కార్మికులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మరచిపోయారని, వెంటనే పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు.

government_solve_the_problems_of_municipal_workers_and_employes

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 5:08 PM IST

Government Solve The Problems Of Municipal Workers And Employes: ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా నేటికీ అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని మరచిపోయారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజయవాడ ధర్నా చౌక్ లో రిలే దీక్ష చేపట్టారు.

Government Solve The Problems Of Municipal Workers And Employes

'నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం, ఇక తప్పదు' - 27వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె

Vijayawada Dharna Chowk Workers Strike: తమ సమస్యలపై ఇప్పటికే అనేక సార్లు మంత్రులు, అధికారులతో చర్చలు జరిపినా సమస్యలకు పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 21వ తేదీ లోపు తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. డిసెంబర్ 14వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. లేకుంటే డిసెంబర్ 21 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే జగన్​ను గద్దె దింపుతామని ఆయన హెచ్చరించారు.

'మేం సమ్మె చేస్తే ప్రభుత్వానిదే బాధ్యత'- మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన

Agitated To Solve The Problems Of Municipal Sanitation Workers: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ(All India Trade Union Congress) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు కోడే దాసు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మునిసిపల్ పారిశుధ్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పోరాటాలు చేస్తున్నామని, అయినా తమ సమస్యలను పరిష్కరించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. కార్మికుల ఆందోళనకు ప్రభుత్వం స్పందించి బుధవారం రోజున చర్చలకు ఆహ్వానించిందని ఏఐటీయూసీ దాసు తెలిపారు. బుధవారం చర్చలు సఫలం కాకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు.

Municipal Workers Maha Dharna in Vijayawada: హామీలు నెరవేర్చాలంటూ.. మున్సిపల్ కార్మికుల చలో విజయవాడ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.