ETV Bharat / state

గ్రామ, వార్డు వాలంటీర్లకు.. ఉగాది రోజు ప్రభుత్వ పురస్కారాలు - ఈరోజు ఉగాది రోజు వాలంటీర్లకు ప్రభుత్వ పురస్కారాలు తాజా వార్తలు

ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లను ఉగాది రోజు ప్రభుత్వం సత్కరించనుంది. ఈమేరకు నియమ, నిబంధనలు పేర్కొంటు ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాలు అమలు, ప్రకృతి వైపరీత్యాల్లో సేవల ఆధారంగా ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు.

government awards for village and ward volunteers
ఉగాది రోజు ప్రభుత్వ పురస్కారాలు
author img

By

Published : Apr 1, 2021, 3:11 PM IST

Updated : Apr 1, 2021, 5:12 PM IST

ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వాలంటీర్లను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేవా వజ్రకు 30 వేల నగదు, సేవా రత్నకు 20 వేలు, సేవా మిత్రకు 10వేల నగదు పురస్కారాన్ని అందజేసి, శాలువాతో సత్కరించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ సత్కారానికి... నవరత్నాల అమలులో చూపిన చొరవ, కొవిడ్, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 13న వార్డు, గ్రామ వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేసింది. గ్రామ వార్డు వలంటీర్ల గౌరవ వేతనం తో పాటు ఇతర వ్యయం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 261 కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఇవీ చూడండి:

గుంటూరులో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సీఎం జగన్‌

Last Updated : Apr 1, 2021, 5:12 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.