గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా తమను తీసుకోవాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వం స్పందించలేదని గోపాలమిత్ర సంఘం నాయకులు వాపోయారు. ఈ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులకు... 24గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్న తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
ఇదీ చూడండి: సీఎం గారూ... మాకిచ్చిన హామీ గుర్తుందా...?