కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి... రెండు కార్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు పాటి శ్రీనివాసరావు, రాజు, సురేష్, మనోజ్లుగా పోలీసులు గుర్తించారు.
పాటి శ్రీనివాసరావు ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు... నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు.