కృష్ణా జిల్లాలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
గన్నవరంలో...
జడ్పీ బాలుర పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి సుబ్రమణ్యం, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీ దంపతులు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక్కడ ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఫిట్స్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అప్రమత్తమై తాళాలు చేతిలో పెట్టి సపర్యలు చేయడంతో కోలుకున్నాడు. ఓటర్ స్లిప్‌లు పంపిణీలో అధికారులు విఫలమయ్యారు. అవి లేకపోవడంతో ఓటర్లను ఎన్నికల సిబ్బంది వెనక్కు పంపుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా స్లిప్పుల పంపిణీ చేపట్టారు.
బాపులపాడులో...
బాపులపాడు మండల కేంద్రంతో పాటు బండారుగూడెం, కొత్తపల్లిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు.
నూజివీడులో...
పాత రావిచరర్లలో ఓటర్లను తీసుకొని ఓ వాలంటీర్ పలుమార్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు దృష్టికి తీసుకువెళ్లారు. అతడిని సిబ్బంది అడ్డుకోవటంతో చిన్నపాటి వివాదం జరిగింది. ఎట్టకేలకు వాలంటీర్‌ను అక్కడి నుంచి పంపేశారు.
గంపలగూడెంలో...
గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు మోసం చేశాడంటూ.. పెనుగోలనులో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్దులు ఓటింగ్‌లో పాల్గొనమని ప్రకటించారు. పోలింగ్ కేంద్రంలో తమ మద్దతుదారుల తరుపున ఏజెంట్ ఉండడని తెలిపారు.
రెడ్డిగూడెంలో...
సమస్యాత్మక పోలింగ్ కేంద్రం రెడ్డిగూడెం మండలం నాగులూరులో.. ఉదయం నుంచి ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 75 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకుంది. ఎన్నికల సరళిని జిల్లా ఎస్పీ రవింద్రనాథ్ బాబు, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. అన్ని గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.
రెడ్డిగూడెం పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా నేతల మద్య ఘర్షణ జరిగింది. ఓ వృద్ధురాలిని పోలింగ్ బూత్ లోపలికి తీసుకువెళ్ళి వైకాపా మద్దతుదారు తరపు ఏజెంట్ ఓటు వేయించాడని ప్రత్యర్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
పమిడిముక్కలలో...
పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. లంకపల్లి శివారు అప్పారావుపేటలో ఓటు వేసేందుకు వచ్చిన దివ్యాంగుడిని పోలీస్ సిబ్బంది కుర్చీలో మోసుకెళ్లారు.
ఉంగుటూరులో...
తేలప్రోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారి సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ దుర్గాప్రసాద్, ఎంపీడీవో జ్యోతి పరిశీలించారు.
ఇదీ చదవండి: