కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం బైపాస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేమూరి-కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి యానాంకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. బస్సు.. లారీని క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇదీ చదవండి: కారు ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి