కృష్ణానదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫలింతగా బ్యారేజీ దిగువ ప్రాంతాలకు పెద్దఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది పరివాహకంలోని యనమలకుదురు, పెదపులిపాక, కేసరనేనివారిపాలెం, మద్దూరు ప్రాంతాల్లో పంటపొలాలు జలమయమయ్యాయి.
నదికి సమీపంలోని నివాసాలు, ఆలయాల్లోకి కూడా వరద నీరు చేరింది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వరద ప్రభావిత మండలాల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.
ఇదీ చూడండి: