ఎగువన కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మున్నేరు, కట్లేరు, వైరా తదితర వాగుల నుంచి వదరనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఎగువ నుంచి 1 లక్షా 56 వేల 899 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లనూ ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
గుంటూరు ఛానల్, ఏలూరు, బందరు కాలువ, రైవస్ కాలువలకు పూర్తి సామర్ధ్యంతో నీటిని విడుదల చేస్తున్నట్టు జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అటు సముద్రంలోనికి కూడా 1 లక్షా 38 వేల 940 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 57.05 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. బ్యారేజీలో నీటి నిల్వ 3.07 టీఎంసీలు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజి ఎగువ ఉన్న మున్నేరు, వైరా, కట్లేరు,విప్లవాగు, కీసరలో వరద ఉధృతి తగ్గుతుండటంతో సాయంత్రానికి ప్రవాహాలు తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: అల్పపీడన ప్రభావం.. జోరుగా ఒకటే వాన..