కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. మూడు గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. బాధిత కుటుంబాల వారు వ్యవసాయ పనులకు వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. గుంటూరు జిల్లా రేపల్లె అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రూ.రెండు లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. గృహాల్లో ఉన్న వస్తువులు, సామగ్రి, దుస్తులు పూర్తిగా మంటలలో కాలిపోవటంతో ఆయా కుటుంబాల వారు కట్టుబట్టలతో మిగిలారు.
ఇదీ చదవండి: నూజివీడు: బోర్డు తిప్పేసిన అమరావతి బ్యాంక్