కరోనాతో స్తంభించిన దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుప్పకూలిపోకుండా ఉండేందుకు ఆత్మనిర్భర భారత్ అభియాన్ ప్యాకెేజీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు డి.అనంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తిరిగి వ్యవస్థలను గాడిలోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఆత్మనిర్భర భారత్ అభియాన్ తొలిదశలో భాగంగా 15 ఉద్దీపన చర్యల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కల్పిస్తోన్న ప్రయోజనాలు లక్షల మంది జీవనోపాధిని కాపాడేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. మారటోరియం- ఈక్విటీ తదితర నిర్ణయాలు ఆశావహ అంశాలని ఈటీవీ ముఖాముఖిలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి