దివంగత ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో స్థానిక పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 34వ వర్ధంతిని నిర్వహించారు. ఆ మహనీయుని జీవితమంతా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంకితమైందని కొనియాడారు.
ఇదీ చూడండి: