ETV Bharat / state

'తెదేపా సవరణలు సూచించినా.. వైకాపా మద్దతిచ్చింది'

author img

By

Published : Dec 9, 2020, 7:54 PM IST

కృష్ణాజిల్లా నందిగామ మండలం అడవిరావులపాడులో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. పసుపు చైతన్యంలో భాగంగా.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ చట్టాలపై తెదేపా సవరణలు సూచించినా.. వైకాపా మద్దతిచ్చిందని పేర్కొన్నారు.

pasupu chaitanyam in adaviravulapadu
పసుపు చైతన్యంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని ఎందుకు కొనిపించలేకపోతుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశ్నించారు. పసుపు చైతన్యంలో భాగంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి.. కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడులో దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు. 75 కిలోల ధాన్యం బస్తాకు రూ. 472లు దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు.

పంట బీమా కట్టకుండా ప్రభుత్వం మొద్దునిద్రపోయి.. రైతులను గాలికొదిలేసిందని సౌమ్య విమర్శించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత లేకుంటే.. రైతు బతికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్​లో తెదేపా సవరణలు సూచిస్తే.. వైకాపా మాత్రం మద్దతు ప్రకటించిందన్నారు. రైతుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరేమిటో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

కొవాగ్జిన్ ట్రయల్​రన్ వాలంటీర్లుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్​ దంపతులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.