అంబేద్కర్ వాదినని చెప్పుకొనే సీఐడీ అధికారి సునీల్ కుమార్.. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడమేంటని మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ నిలదీశారు. సునీల్ కుమార్ స్థానంలో మరో రెడ్డిని నియమించి, ముఖ్యమంత్రి తన కక్షసాధింపులకు వాడుకోవచ్చు కదా అని దుయ్యబట్టారు. సునీల్ కుమార్ ఒక కులాన్ని, కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
ఐపీఎస్ గా కాకుండా, వైకాపా చొక్కా వేసుకున్నవాడిలా ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచడానికి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించేలా ప్రవర్తించడం సునీల్ కుమార్ కు తగదని మాజీ మంత్రి హితవు పలికారు. ముందు ఆయన తన ఇంటిని చక్కబెట్టుకోవడం నేర్చుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: