అన్ని ప్రాంతాల సమానాభివృద్దే ముఖ్యం: పార్థసారథి - పార్థసారధి తాజా వార్తలు
చంద్రబాబు మతి భ్రమించి వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారని వైకాపా విమర్శించింది. అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని ఆరోపించింది. తన ఎమ్మెల్యేలు పోయిన పర్వాలేదు... తనకు అమరావతి ముఖ్యమనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

పార్థసారథి
రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని... కేంద్రం స్పష్టంగా చెప్పిందని వైకాపా అధికార ప్రతినిధి పార్థసారధి వివరించారు. అమరావతి కోసం కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు... రూ.52 వేల కోట్లు ఖర్చు చేశామని అసత్యాలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశారని.. కోర్టులను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తమకు అన్ని ప్రాంతాల సమానాభివృద్దే ముఖ్యమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... 48 గంటల సవాలు విసిరి ఏం చేశారో చెప్పాలి: బొత్స