ETV Bharat / state

ఎన్నికలు నిర్వహించని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు - విశాఖలో పంచాయతీ ఎన్నికలు

వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్​ఈసీ ఆదేశాల మేరకు కృష్ణా, విశాఖ జిల్లాలోని పలు గ్రామాలకు రీ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సకాలంలో నామినేషన్ దాఖలు చేసుకోవాలని కోరారు.

ఎన్నికలు నిర్వహించని గ్రామ పంచాయితీలకు ఎన్నికలు

author img

By

Published : Mar 3, 2021, 7:25 PM IST

Updated : Mar 3, 2021, 8:21 PM IST

పలు కారణాలతో ఎన్నికలు నిర్వహించని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్దమౌతున్నారు. కృష్ణా జిల్లాలోని 6 మండలాల్లో ఎన్నికలను జరపుతున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 15 నుంచి ఎన్నికలు జరిపి.. అదేరోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

విజయవాడ డివిజన్, తోట్లవల్లూరు మండలంలో భద్రిరాజుపాలెం, 10వ వార్డు, గుడివాడ డివిజన్, పామర్రు మండలం రిమ్మనపూడి 2, 6వ వార్డులు, నందివాడ మండలం చినలింగాల 2, 4, 8వ వార్డులు, మచిలీపట్నం డివిజన్, బంటుమల్లి మండలం, చినతుమ్మిడి 8వ వార్డు, గూడురు మండలం కోకానారాయణపాలెం 4వ వార్డు, నూజివీడు డివిజన్​లోని నూజివీడు మండలం హనుమంతుల గూడెం 5వ వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు పంచాయతీ ఎన్నికల అధికారులను నియమించామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని వార్డులకు రీ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకన్న బాబు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాలతో సొలభం పంచాయతీ రెండో వార్డు, కిల్లంకోట పంచాయతీ 1, 2 , 4, 5 , 6 , 7, 8 ,9 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మార్చి 4 నుంచి మార్చి 6 సాయంత్రం 5 గంటల వరకు వార్డు మెంబర్లు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి కలిగినవారు సకాలంలో నామినేషన్ దాఖలు చేసుకోవాలని వెంకన్నబాబు కోరారు.

ఇవీ చదవండి విషాదం: పామర్రులో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

Last Updated : Mar 3, 2021, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.