కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు.. అభ్యర్థుల ఏజెంట్లు సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు.
విజయవాడ
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల లెక్కింపు ఆంధ్రలయోలా కళాశాలలో ప్రారంభమైంది. మొత్తం 64 డివిజన్లకు జరిగిన పోలింగ్‌కు సంబధించి తెదేపా నుంచి 57 మంది అభ్యర్ధులు, వైకాపా 64, జనసేన-40, భాజాపా-22 మంది, సీపీఐ-6, సీపీఎం-22, కాంగ్రెస్-34, బీఎస్పీ-2, ఇతరులు-7, స్వతంత్రులు 93 మంది అభ్యర్ధులు పోటీల్లో నిలిచారు. మొత్తం 347 మంది అభ్యర్థులు నగర పాలక సంస్థ ఎన్నికల బరిలో ఉన్నారు. మూడు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు . రౌండ్‌కు 23 డివిజన్ల చొప్పున ఓట్లు లెక్కించనున్న అధికారులు చివరి రౌండ్లో 18డివిజన్లలో కౌంటింగ్ చేయనున్నారు.
నందిగామ
నందిగామ నగర పంచాయతీ పరిధిలో ఎన్నికల కౌంటింగ్‌ను అధికారులు ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట 10 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. అవి పూర్తికాగానే మరో పది వార్డుల్లో ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల లోపు పూర్తి ఫలితాలను ప్రకటించటానికి అధికారులు యత్నిస్తున్నారు.
నూజివీడు
నూజివీడులో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక సారథి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం ఈ కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేశారు.
తిరువూరు
తిరువూరులో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అధికారులు.. అభ్యర్థుల ఏజెంట్లు సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు.
ఇదీ చదవండీ.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం