ETV Bharat / state

నందిగామలో కొనసాగుతున్న ఎన్నికల ఏర్పాట్లు.. - నందిగామలో ఎన్నికల ఏర్పాట్లు

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ.. కృష్ణా జిల్లా నందిగామలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నందిగామలో పోలింగ్‌ సామగ్రి కోసం రావాలని ఎన్నికల సిబ్బందికి ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. నందిగామ జడ్పీ పాఠశాలలోని పంపిణీ కేంద్రం ఆవరణలో పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని సిబ్బందికి అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు.

election arrangements in nandhigama even the court orders
నందిగామలో కొనసాగుతున్న ఎన్నికల ఏర్పాట్లు
author img

By

Published : Apr 7, 2021, 12:33 PM IST

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ.. కృష్ణా జిల్లా నందిగామలో అధికారులు ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన మౌఖిక ఆదేశాలతో పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. నందిగామ మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని సిబ్బందికి అందజేసేందుకు.. నందిగామ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధులకు సిబ్బంది అంతా హాజరు కావాల్సిందిగా ప్రత్యేకంగా ఫోన్ చేసిమరీచెప్తున్నారు. అసలు ఎన్నికల జరుగుతాయో లేదో అనే అయోమయంలో ఉన్నామని.. సిబ్బంది అంటున్నారు.

ఇదీ చదవండి: ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.